వర్షం నీటితో పలు కాలనీలోని రోడ్లు అస్తవ్యస్తం.
కాలనీలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి.
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గోరేపల్లి సుదర్శన్ గౌడ్.
తాండూరు జులై 28(జనంసాక్షి)గత వారం రోజుల నుండి భారీ వర్షాలతో తాండూరు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గోరేపల్లి సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు.
శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గోరేపల్లి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ వాగులు,కుంటలు, మురికి కాలువలు పొంగిపొర్లుతూ పలు కాలనీలోకి నీరు చేరుతుందని.వర్షం నీటి ద్వారా ప్రజలకు అనేక ఆనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.వర్షం నీటితో పలు కాలనీలోని రోడ్లు అస్తవ్యస్తంగా మారి ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు.వెంటనే సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని
కోరారు. అంటు వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో ఆరోగ్య శాఖ వారు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించా లన్నారు.ఎమ్మెల్యే సంబంధిత శాఖలకు వెంటనే ఆదేశాలు జారీచేసి మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.