అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం
నంగునూరు, జులై18 (జనంసాక్షి):
మండల కేంద్రానికి చెందిన మేదరి శివయ్య, భవానీ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి కళ్యాణ్, శిరీష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భవాని ఆరు నెలల క్రితం తీవ్రనారోగ్యంతో బాధపడుతూ మరణించగా, శివయ్య కూడా పది రోజుల క్రితం మరణించాడు. ఈ విషయాన్ని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు భవన నిర్మాణ కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సోమవారం రోజున 50 కిలోల బియ్యాన్ని యాదగిరి ద్వారా ఆ పిల్లలకు అందజేశారు. యాదగిరి కూడా వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వారు మాట్లాడుతూ… భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా కాంగ్రెస్ తరపున ఎల్లకాలం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు పిల్లలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకయ్య, మండల యువజన కాంగ్రెస్ నాయకుడు యాదగిరి, నాగరాజు, కిషన్, శ్రీనివాస్, సాయికుమార్, చింటూ, నర్సింలు, రాజు, తదితరులు ఉన్నారు.
Attachments area