అనారోగ్యంతో ఉన్న సర్పంచ్లను పరామర్శించిన సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు

అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) మండలంలోని పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న సర్పంచులను వారిని సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారం రాజశేఖర్ పరామర్శించారు. మండలంలోని అనంతారం గ్రామంలో సర్పంచ్ చిన్న కామయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలుసుకున్న నారం రాజశేఖర్ వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్రాలు చెరువు సర్పంచ్ కల్పాల దుర్గయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటికాడ ఉండటంతో వాళ్ల దగ్గరికి వెళ్లి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోడపర్తి వెంకటేశ్వరరావు, తెరాస పార్టీ యువజన నాయకులు కలపాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.