ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

జనం సాక్షి/ రేగోడు సెప్టెంబర్ 21
అనారోగ్యంతో బాధపడి తీవ్ర ఇబ్బందులకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి, పథకం ద్వారా బాధిత కుటుంబీకుడైన మండలంలోని ప్యారారం గ్రామానికి చెందిన బేగర్ ప్రకాష్ కు రూపాయలు 56వేలను అందజేశారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందడంతో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల నర్సింగ్ రావు ఉపాధ్యక్షులు శివ కుమార్ రేగోడు మండల యూత్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ వార్డు మెంబర్ నర్సింగ్ రావు పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి వడ్ల విశ్వనాథం అందజేశారు. కాగా ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై అధికార పార్టీకి మద్దతుగా కొనసాగనున్నట్లు ప్రకాష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంగారెడ్డి సుందరయ్య గొల్ల సామెల్ కిష్టారెడ్డి రవికుమార్ శివ గౌడ్ రామయ్య నాగయ్య నర్సింలు రాజు సంజీవులు ,కిష్టయ్య,అంజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.