అనారోగ్యంతో యువకుడు మృతి
ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం అధ్యక్షుడు
జగదేవ్ పూర్, అక్టోబర్ 13 (జనంసాక్షి):
జగదేవ్ పూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గ్రామ రజక సంఘం సంయుక్త కార్యదర్శి రాచకొండ రాజు (33) అనే యువకుడు గురువారం అనారోగ్యంతో మృతిచెందాడు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న రాజు హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఇటిక్యాల గ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి రూ.5000లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు ఎల్లేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన రాజు చిన్న వయస్సు లో మృతి చెందడం భాదాకరమన్నారు. రాజు మృతి తో అతని భార్య కుమారుడు కూతురు వీదినపడ్డారని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో రాష్ట్ర రజక సంఘం నాయకుడు రత్నాల కనకయ్య, జగదేవ్ పూర్ మండల రజక సంఘం గౌరవాధ్యక్షులు అక్కారం నర్సింలు, ఉపాధ్యక్షులు రాచకొండ యాదగిరి, జూపల్లి రాజశేఖర్, వడ్లకొండ శ్రీనివాస్, ఎడపల్లి వెంకటయ్య, రాచకొండ ఆంజనేయులు, కోశాధికారి రాచకొండ బాల్ నర్సయ్య, సంయుక్త కార్యదర్శి అక్కరాజు కనకయ్య, వడ్లకొండ శేఖర్, రాచమల్ల నారాయణ, రాచమల్ల నర్సింలు, రాచమల్ల రమేశ్, మర్కుక్ మండల రజక సంఘం నాయకుడు గంధమల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Attachments area