Wednesday, 4 November 2026

అన్నదానం మహాదానం- కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్

అన్నదానం మహాదానం- కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): అన్నదానం మహాదానమని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విద్యానగర్ నందు నెలకొల్పిన పలు వినాయక మంటపాల వద్ద తాము అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం విద్యానగర్ లో గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ సమీపంలో గజానన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పంపిణీ చేసిన మట్టి విగ్రహాలను వార్డులో అనేక చోట్ల నెలకొల్పినట్లు తెలిపారు.వార్డులో ఇంటింటికి మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.గణేష్ ఉత్సవాలలో
భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, నిమజ్జనం కార్యక్రమం పోలీసు శాఖ వారి సూచనల మేరకు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ సలీం,రాచకొండ శ్రీనివాస్, కలకోట లక్ష్మయ్య, గుండా శ్రీధర్, జూలకంటి నాగరాజు, బజ్జూరి శ్రీనివాస్,మంచాల శ్రీనివాస్,బెజగం ఫణి, దేవరశెట్టి ఉమారాణి,గజానన్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.