బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 20
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కార్పొరేటర్ మేకల సునీత రామూయాదవ్ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మండప నిర్వహకులు కార్పొరేటర్ కు శాలువాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల రామూయాదవ్ తదితరులు పాల్గొన్నారు.




