సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): అన్నదానం మహాదానమని వేక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగవరపు గణేష్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని అపూర్వ బదిరుల పాఠశాలలో రమక దీపాన్విత రెండవ జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా దీపాన్విత తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి వారి తమ కూతురు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో రమాక భార్గవ్ , ప్రేమిల, శ్రీకాంత్, కీర్తన , క్లరా, భవాని , సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




