అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు సహకరించాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఏరిమెలిలో నిర్మించే అన్నదాన భవన నిర్మాణానికి తమ వంతుగా జిల్లా నుండి భక్తులు సహకారం అందించాలని ఆ సంఘ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భాస్కరాచారి కోరారు.ఆదివారం స్థానిక సిద్ది సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షులు ఎంవిడి ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.జిల్లాలోని అయ్యప్ప స్వామి భక్తులు తమవంతుగా ఆర్థికంగా కానీ, వస్తు రూపేణా కానీ సహకారం అందించి భవన నిర్మాణం జరిగేలా చూడాలన్నారు.త్వరలో మహిళా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులను సిద్ది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కమిటీ అద్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎంవిడి ప్రసాద్ రావు , జిల్లా ప్రధాన కార్యదర్శి , అన్నదాన భవన నిర్మాణ కమిటీ సభ్యులు రంగు ముత్యంరాజు , కార్యదర్శి భూపతి శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు కంచర్ల శేఖర్ , కోశాధికారి మాశెట్టి నరేష్ , మహిళా కమిటీ సభ్యులు , సూర్యకుమారి , రంగు స్వాతి , జిల్లా కార్యవర్గ సభ్యులు మొరిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.