Thursday, 5 November 2026

: కుల హత్యకు నిరసనంగా 23న విద్యాసంస్థలు బంద్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 21
రాజస్థాన్ రాష్ట్రంలో టీచర్ చేతిలో దాడికి గురై చనిపోయిన దళిత చిన్నారి ఇంద్ర కుమార్ మేఘ్వాల్ హాత్యను నిరసిస్తూ.మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అల్వాల్ మండల్ కేంద్రంలో ఎమ్మెస్ఎఫ్ సమావేశం ఏర్పాటు చేయడంజరిగింది. ముఖ్య అతిథిగ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర సెక్రటరీ భైరపోగు శివకుమార్ మాదిగ మాట్లాడుతూ.రాజస్థాన్ రాష్ట్రంలో మూడవ తరగతి విద్యార్థి ఇంద్ర కుమార్ మేఘ్వాల్ పై జరిగిన కుల హత్యని నిరసిస్తూ స్వాతంత్ర  దినోత్సవ వేడుకల్లో ఈ చిన్నారి కుల హత్య గురించి ప్రధాని స్పందించకపోవడం యావత్ దేశంలో ఉన్న దళిత జాతిని తీవ్రదిగ్భ్రాంతికి గురి చేసింది.స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా దళిత సమాజానికి కానీ అట్టడుగు వర్గాలకు కానీ రక్షణ లేకపోవడంఇటువంటి అంశాలను ప్రధాని ప్రసంగంలో లేకపోగా ఘనంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ జరుపుకున్నాం అని మాట్లాడటం మా జాతికి తీవ్ర అన్యాయంగా భావిస్తూ తెలంగాణ వ్యాప్తంగాఈ నెల 23 నవిద్యాసంస్థలబంద్ కుపిలుపునివ్వడం జరిగింది.ఈ బందుకు విద్యా సంస్థల చైర్మన్లు ప్రిన్సిపాల్స్ ప్రజలు ప్రజాస్వామ్య వాదులు కులసంఘాలు ప్రతి ఒక్కరు పాల్గొని సహకరించగలరువిజ్ఞప్తిచేస్తున్నాము.ఈకార్యక్రమంలోమధు,శివ,బాబు,పరుశురాం,కురుమయ్య,సతీష్, బాలరాజు, సాయి,భాను,రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.