Wednesday, 4 November 2026

అన్నా రాజకీయ పార్టీ పెడతారని ముందే వూహించాం: వీహెచ్‌

హైదరాబాద్‌: సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తారని ముందే వూహించామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పార్టీ ఏర్పాటుచేస్తున్నారని, ఆయన వెనక భాజపా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భాజపా అదికారంలోకి వచ్చేందుకు అన్నా హజారేను వాడుకుంటోందని వీహెచ్‌ అన్నారు. అవినీతిని నివారించే శక్తి కాంగ్రెస్‌ పార్టీకే ఉందని, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే అవినీతి పరులను జైలుకు పంపించిందని ఆయన గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *