ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్రoలో కులవృత్తుల అభ్యునతికి పాటు పడుతున్న సీఎం కెసిఆర్ రేనని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు.గురువారం చిట్యాల గ్రామంలో మత్స్య శాఖ పరిశ్రమిక సంఘం ఆధ్వర్యంలో ఎల్కా చెరువు మరియు తూర్పు చెరువులలో ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ఉచితంగా అందిస్తున్న చేపపిల్లలను తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య తో కలిసి పంపిణి చేశారు. తరువాత ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని 9చెరువులలో ఈరోజు 11లక్షల 80వేల చేపపిల్లలు (కట్ల,రవ్వ,పులుసా) రకాల చేపపిలల్లు పంపిణి చేయడం జరిగిందని అన్నారు. చిట్యాల గ్రామంలోని రెండు చెరువులలో కలిపి 2లక్షల62వేల చేప పిల్లలు చెరువులలోకీ వదలడం జరిగిందని తెలిపారు. ఈ చేప పిల్లలను ముదిరాజ్ సంఘం సభ్యులు మంచిగా వృద్ధిలోకి తెచ్చుకోని వారి కుటుంబలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనీదే కెసిఆర్ లక్ష్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మత్స్య శాఖ అధ్యక్షులు పులుగుజ్జా శ్రీధర్, కార్యదర్శి గుంటుక వెంకన్న,మాజీ అధ్యక్షులు పిట్టల వెంకన్న, నరబోయిన హన్మతు, పాక నాగయ్య, వార్డు సభ్యులు గుంటుక కుమారస్వామి, దాసరి శ్రీనివాస్, పాక శ్రీహరి, ఆవుల కొమురల్లి, మాజీ వార్డు సభ్యులు కొయ్యేడి యాకయ్య, ఆవుల సోమన్న, కొయ్యేడి వీరయ్య, ఈదురు వెంకన్న, తెరాస గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు మొగులగాని హరీష్, ఎంపీపీస్ విద్య కమిటీ చైర్మన్ పోతుగంటి శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ బానోత్ శంకర్, బావోజీ తండా తెరాస పార్టీ అధ్యక్షులు బానోత్ శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area




