*అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మానవత్వాన్ని నిదరలేపిన అయినాల సురేష్ కుమార్ భవాని దంపతులు.*

కోదాడ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
కోదాడ పట్టణానికి చెందిన ఆయినాల సురేష్ కుమార్ భవానిలు గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యుల్ని ఆదుకోవడంలో ఉన్న ఆనందం మరెక్కడ దొరకదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడు వారి కళ్ళలో నుండి వచ్చే ఆనందభాష్పాలు వెలకట్టలేనివని అన్నారు. సోమవారం శనగల రాధాకృష్ణ వికలాంగుల ఆశ్రమంలో, బస్టాండులో, నాగిరెడ్డి జయమ్మ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీము చేపట్టిన కార్యక్రమాలను చూసి ఎంతోమంది దాతలుగా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు మునుముందు రోజులలో ఇంకా ఎక్కువ మందికి సాయపడే విధంగా భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అయినాల సురేష్ కుమార్,అయినాల  భవాని,నల్లబోతు పద్మావతి,బత్తుల రమేష్,వైష్ణవి,మాధవ్ చౌదరి,అయినాల వెంకటేశ్వర్లు,కాంపాటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు
Attachments area