అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం
జహీరాబాద్ సెప్టెంబర్ 3( జనంసాక్షి) అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శనివారం
కొహీర్ మండలంలోని మద్రి, గుర్జువాడ, రజనెల్లీ, మచిరెడ్డిపల్లి, పిచెర్యగడి గ్రామాలలో కోటి రూపాయల ఎస్ డి ఎఫ్ ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అనంతరం అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.ఈ కార్యక్రమాల్లో కోహీర్ జడ్పీటీసీ రాందాస్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు బంటు రామకృష్ణ, ఎంపీపీ మాధవి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కే నర్సింహులు, మాజీ మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డీ, సర్పంచులు రమేష్, సంగారెడ్డి, లచ్చమ్మ, రవికిరణ్, ఏసురత్నం, కృష్ణ, ఎంపీటీసీలు శ్రీనివాస్, సుభాంగి, నాయకులు కలిమ్, దశరథ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, బాబీ, మ్యాతరి ఆనంద్, ఇఫ్తేకర్, ఆనందం, అజ్మత్ రాహుల్, సావుద్, ఎస్‌కే జవిద్, సాయిలు తదితరులు ఉన్నారు.