హుజూర్ నగర్ జూన్ 10 (జనంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడిన కేసీఆర్ రాష్ట్రం సాధించుకొని అదే మమకారంతో, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారన్నారు. ప్రజల మధ్య ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, మినీ ట్యాంక్ బండ్, మోడల్ లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా , వికలాంగులకు 4 ,016 పెన్షన్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. అనంతరం ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ యాకుబ్ పాషా, కౌన్సిలర్లు జక్కుల శంభయ్య, కొమ్ము శీను, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలు ప్రారంభం




