రామాయంపేట,ఆగస్టు28 : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఆమె పర్యటించారు. నందగోకుల్, నస్కల్, బచ్చురాజుపల్లి, తిప్పనగుళ్ల, కల్వకుంట గ్రామాల్లో లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సర్కారు అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కులవృత్తులను పోషించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆమె తెలిపారు.




