Thursday, 5 November 2026

అపరిచితులతో జాగ్రత్త

పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): అపరిచిత వ్యక్తులు, వివిధ రిపేర్లతో వచ్చే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా ఎల్బీనర్‌ పరిధిలో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు దర్మయాప్తు చేస్తున్నారు. సోఫాలురిపేరుపేరుతో వచ్చిన వ్యక్తి నగలు,నగదుతో ఉడాయించాడు. సోఫా బాగు చేసే పేరుతో వచ్చిన గుర్తుతెలియిన దుండగులు నగదు, నల్లపూసల గొలుసును అపహరించారు . ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. చంద్రపురి కాలనీలో నివసిస్తున్న కృష్ణతేజ తన ఇంట్లో ఉన్న పాత సోఫా బాగు చేయించాలనుకున్నాడు. సోఫాలు బాగుచేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలో తిరుగుతుండగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు వారిని పిలిచి సోఫా రిపేర్‌ చేయించాడు. సోఫా బాగు చేసిన తర్వాత వారు వెళ్లిపోతూ గదిలో ఉన్న రూ. 3,500, రూ. 30 వేల విలువ చేసే ఒకటిన్నర తులం నల్లపూసల గొలుసు ఉన్న బాగు తీసుకొని ఉడాయించారు. నగదు, నగలు భద్రపరిచిన బ్యాగు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.