Wednesday, 4 November 2026

అపస్మారక స్థితిలో వున్నా పిచ్చుక కి  సి.పి.ఆర్..!

అపస్మారక స్థితిలో వున్నా పిచ్చుక కి  సి.పి.ఆర్..!
భైంసా రూరల్ మార్చ్ 26 జనం సాక్షి – మనుషులకే కాదు..! గుండె ఆగిన పక్షులకు సిపిఆర్ పనిచేస్తుందని తెలిపిన శ్యామ్…నిర్మల్ జిల్లా బైంసా మండలం హస్గుల్ గ్రామంలోని శ్యామ్ అనె వ్యక్తి ఇంటివద్ద స్వేచ్ఛగా సంచరిస్తున్న పిచ్చుక ఇంట్లోకి ధాన్యపు గింజలకై రాగా ఇంట్లో వున్నా ఫ్యాన్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయింది.వెంటనే గమనించిన చాయ్ వాలా శ్యామ్ ఆ పిచ్చుకకి ఊపిరాడడం లేదని గమనించాడు.ఇటీవల చాలామంది మనుషులు గుండెలాగిపోయి చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గుండె పని చేయడం ఆగిన మనుషులకి డాక్టర్స్,స్వచ్ఛంద సంస్థలు ఇలా  సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో సి.పి.ఆర్ సిస్టం గురించి ప్రచారం జరుగుతుంది. అట్టి సి.పి.ఆర్ సిస్టం గుర్తుకువచ్చి ఆ పిచ్చుకపై ప్రయోగించాడు శ్యామ్.వెంటనే ఆ పిచ్చుక ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. మెలకువ లోకి వచ్చిన పిచ్చుకకి కొంత సమయానికి నీటిని ఇచ్చారు.కోలుకున్న పిచ్చుక నీటిని తాగి సంతోషంగా పైకి ఎగిరిపోయింది.