అప్పులు చేసే బాధ తప్పుతుంది
నిజామాబాద్,మే11(జనం సాక్షి ): బాల్కొండ మండలం నాగాపూర్‌లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం చెక్కులను, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఎంపీపీ ఏ.రాధ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడిసాయం వల్ల రైతులకు వూరట కలుగుతుందని అప్పులు చేసే బాధ తప్పుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో మాత్రమే ఈ పథకం అమలవుతుందని ఆమె తెలిపారు. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్‌కమిటీ ఛైర్‌పర్సన్ పి.లలిత, సర్పంచి రజిత, రైతు సమన్వయసమితి మండల సమన్వయకర్త విద్యాసాగర్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.