అప్పుల బాధతో పురుగుల మందు తాగి గీత కార్మికుడు మృతి.
దుబ్బాక ఆగష్టు 29,( జనం సాక్షి )
దుబ్బాక మండలపరిదిలోని లచ్చపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు మైసగౌని శ్రీనివాసగౌడ్ (44) అప్పుల బాధ తాళలేక గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నాలుగు రోజులుగా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.