అఫ్జల్ ఖాన్ కు న్యాయం చేస్తా : మంత్రి మల్లారెడ్డి

 శామీర్ పేట్, జనం సాక్షి :
శుక్రవారం దుండిగల్ లో ని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశం లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ ప్రత్యేకంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి చేతికి ఇమామే జామీన్ కట్టారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ.. ఇది విజయానికి చిహ్నంగా భావిస్తారని అన్నారు .ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి , శంభీపూర్ రాజు మాట్లాడుతు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే అఫ్జల్ ఖాన్ కు ఎమ్మెల్సీ పదవి కోసం కృషి చేస్తామని అన్నారు. ఆయన తో పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, దర్గా దయాకర్, బండారి శ్రీనివాస్ ,శామీర్ పేట మండలం నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్,సత్య నారాయణ,డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి,మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, జెడ్పీటీసీ అనితా లాలయ్య, మురళీ గౌడ్, రామ స్వామి,శ్రీకాంత్ రెడ్డి,తాళ్ళ జగదీష్ గౌడ్,మంద స్వామి, పల్లె శీను, మురళీ చారి, తదితరులు పాల్గొన్నారు.
21ఎస్పీటీ -1:మంత్రి కి దట్టి కడుతున్న ఆఫ్జల్ ఖాన్

తాజావార్తలు