అబద్ధపు ఆరోపణలు సరికాదు.
బెల్లంపల్లి, జులై27, (జనంసాక్షి)
అబద్ధపు ఆరోపణలు సరికాదని నెన్నెల, కన్నెపల్లి, బిమిని, కాసిపేట, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల టీఆరెస్ నాయకులు ఖండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు వేర్వేరు ప్రకనల్లో వారి ఖండన తెలిపారు. నెన్నెల ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు చిన్నచిన్న విషయాలు చెప్పకుండా స్థానికంగా పరిష్కరిస్తే దీన్ని కూడా రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీలకే చెల్లిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా చేయడంలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ కుట్రలు పన్నుతున్నాయి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో దుర్గం మల్లేష్, దూరిశెట్టి రవి, తోట మధు, గడ్డం స్వామి గౌడ్, పుప్పిరెడ్డి వెంకన్న పాల్గొన్నారు