అభయ హస్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలి

ఎంపీడీవో కు వినతిపత్రం అందజేత

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనంసాక్షి):-  అభయ హస్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని యాచారం ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల అధ్యక్షురాలు ఉమ, మండల కార్యదర్శి మస్కు అరుణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళలకు డ్వాక్రా గ్రూపుల లో సభ్యులుగా చేరి ప్రభుత్వ ఆదేశాల మేరకు అభయహస్తం కింద డబ్బులు జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభయహస్తం పెన్షన్ రద్దు చేయడం జరిగిందని పొదుపు చేసిన అభయహస్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ నేటికీ వాళ్ళ ఖాతాలో జమ కాలేదు జమ చేసిన డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని వినతి లో కోరారు