అభాగ్యులకు అండగా ఐక్యత ఫౌండేషన్

•దివ్యాంగుడికి 10000 ఆర్థిక సాయం చేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
నాగర్ కర్నూలు బ్యూరో ఆగస్ట్ 26జనంసాక్షి:
సమాజం లో సమాన హక్కులు,అవకాశాలు అందరికీ అందాలని  ఏవైనా కారణాల చేత ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థికంగా వెన్నంటి ఉండటమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి , వెనుకబడిన అభాగ్యులకు ఐక్యత ఫౌండేషన్ అండగా నిలుస్తుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఒకటవ వార్డు లో వడ్డెర బస్తికి చెందిన వెంకట్ నారాయణ దివ్యాంగుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని. అతని కుటుంబం నిరుపేద కుటుంబమని తెలుసుకొని తమ వంతు సాయంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు దివ్యాంగుడు వెంకట్ నారాయణ మాట్లాడుతూ  ఆపదలో ఉన్న తన  కుటుంబాన్ని  ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి దృష్టికి వడ్డెర బస్తి కి చెందిన యువత తన కుటుంబం గురించి తన ఆర్థిక పరిస్థితి గురించి తీసుకువెళ్లాగా వెంటనే సహాయం చేసిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు. వడ్డెర బస్తి వాసులు యువకులు తదితరులు పాల్గొన్నారు