*అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు*

కోదాడ.జులై21(జనం సాక్షి)
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిలుకూరు మండలం చెన్నారిగూడెం   గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారుగా 30 కుటుంబాలు చిలుకూరు మండల టిఆర్ఎస్ పార్టీ సంయుక్త కార్యదర్శి కొవ్వూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే  సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క టిఆర్ఎస్ పార్టీకి తప్ప మరె,పార్టీకి చోటు లేదన్నారు. ఇంకా ఇతర పార్టీలో ఉన్న నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరి బంగారు తెలంగాణలో భాగస్వామ్యాలు కావాలన్నారు. పార్టీలో చేరిన వారికి తప్పక సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు కొండా సైదయ్య, జడ్పీకో ఆప్షన్ సభ్యులు జానీమియా,, టిఆర్ఎస్ పార్టీ మండల సంయుక్త కార్యదర్శి కొవ్వూరు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులునాగరాజు, సర్పంచ్ కమతం కొండలు. తెరాస గ్రామ శాఖ. అధ్యక్షుడు. పుట్టపాక, వేంకటేశ్వర్లు (పంతులు), మాజీ సర్పంచ్. గంటాశ్రీనివాసరావు,
పార్టీలో చేరిన వారు మాతంగి రవి,  మట్టయ్య, యడవల్లి నాగేశ్వరరావు, మాతంగివెంకటేశ్వర్లు, అంజయ్య, వెంకటయ్య,  రాజు, వెంకటరత్నం,లక్ష్మీ, కందుకూరి వెంకటమ్మ, కాంగ్రెస్ పార్టీ వార్డ్ నెంబర్, సత్యవతి, సుజాత, సోమయ్య, బొడ్డుపల్లి బిక్షం,కొండల్, శ్రీను, దనముర్తి, సైదులు, పుట్టపాక. కొండలు, సత్యవతి, లక్ష్మి, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area