అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు

కుల్కచర్ల, అక్టోబర్ 12(జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీగా టిఆర్ఎస్ పార్టీలోకి వలసలుగా రావడం చాలా సంతోషంగా ఉందని, నూతనంగా పార్టీలోకి చేరిన వారికి సముచిత న్యాయం ఉంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.బుధవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండీ గౌస్, సభ్యులు మహబూబ్ పాష, గాఫార్ పాషా,బీజేపీ నాయకులు పొమాల నరేష్, పోమాల రాము,మడుగు నర్సింహులు, ఏముల బాలు, చీమ శ్రీను, సార నర్సింహులు, కాకి ఆంజనేయులు తదితరులు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నూతనంగా పార్టీలోకి చేరిన వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కుల్కచర్ల తెరాస పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజు, మాజీ మండల అధ్యక్షులు సారా శ్రీనివాస్,ఎంపీటీసీ పులింగం విజయలక్ష్మి వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు పెంటయ్య, తెరాస సీనియర్ నాయకులు రామకృష్ణ ముదిరాజ్, వార్డు సభ్యుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.