Friday, 6 November 2026

ఉపాధ్యాయ సన్మాన సభకు ఆహ్వానం అందుకున్న ఆఫ్జల్ ఖాన్

శామీర్ పేట్, జనం సాక్షి :16 అక్టోబరు నగరంలో జరిగే ప్రైవేట్ ఉపాధ్యాయుల సన్మాన సభ కు కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ కు నాన్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫెడరేషన్ జాతీయ కన్వీనర్ విజయ్ సింగ్ ఠాకూర్ , అధ్యక్షులు విజయ్ కుమార్ లు ఆహ్వానం నిమిత్తం అఫ్జల్ ఖాన్ నివాసం లో ఆయనతో కలిసి ఆహ్వానించారు. విజయ్ సింగ్ మాట్లాడుతు.. 250 కి పైగా బెస్ట్ టీచర్స్ అవార్డులు ఇందులో ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , సినీ నటులు ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ విజయ్ సింగ్, విజయ్ కుమార్ లకు శాలువా కప్పి సన్మానించారు. అదే విధంగా ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి మద్దతుగా నిలవాలని విజయ్ సింగ్ అఫ్జల్ ఖాన్ ను కోరగా వారు సానుకూలత వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతు.. సమాజ సేవ లో చురుకుగా పాల్గొంటున్న అఫ్జల్ ఖాన్ కు అక్టోబరు 16 వ తేదిన జరిగే సభలో ఘనంగా సన్మానించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్, విజయ్ సింగ్, విజయ్ కుమార్ లతో పాటు నాన్ గవర్నమెంట్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షాహ్ నవాజ్, ఎన్జిటిఎల్ఎఫ్ మెంబర్ సల్మాబేగం, స్థానిక టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మండల నాయకులు తాడెం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
11ఎస్పీటీ -1: ఉపాధ్యాయులను సన్మానిస్తున్న ఆఫ్జల్ ఖాన్