హుజూర్ నగర్ ఆగస్టు (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మఠంపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సామల వెంకటేశ్వర రెడ్డి, అతని అనుచరులు సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. నూతనంగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు




