అభివృద్ధికి ఆమడ దూరంలో ఇప్పల చెలక –అంతర్గత వీధులు బురదమయం

— వాగులపై వంతెనలు లేక అవస్థలు
టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి): మండలంలోని కొప్పురాయి గ్రామపంచాయతీ పరిధిలోగల ఇప్పల చేలక గ్రామం నేటికీ అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో ఉంది . ఆ గ్రామంలో లో 30 కుటుంబాలకు గాను 1 హ్యాండ్ బోరు పనిచేస్తుంది. ఆ గ్రామం లో అంతర్గత వీధులన్నీ బురదమయం, ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండు వాగులు దాటి వెళ్లాలి. ముర్రేడు వాగు,తెల్ల వాగు లపై బ్రిడ్జిలు లేకపోవడంతో ఏ చిన్న పార్టీ వర్షం వచ్చిన ఆ ఊరికి రాకపోకలు బంద్ . ఇటీవల కాలంలో ఎడతెరిపిలేని వర్షాలకు మూలంగా బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయారు. వాగులు దాటే పరిస్థితి లేక నిత్యావసరాల సరుకులకు ఇబ్బందులకు గురయ్యారు. రహదారి సక్రమంగా లేకపోవడంతో ఆటోలు, కనీసం టూ వీలర్లు పోవాలన్న అతికష్టం మీద వెళ్ళాల్సి వస్తుంది. వర్షం వచ్చిందంటే పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు సెలవు వచ్చినట్లే. ఇలాంటి దుస్థితిలో ఈ గ్రామం నెలకొని అభివృద్ధికి దూరంలో ఉన్నందున పాలకులు అధికారులు దృష్టి సారించి వాగులపై వంతెనలను నిర్మాణం చేపట్టి గ్రామంలో అంతర్గత వీధులకు సిమెంట్ రోడ్లు మంజూరు చేయాలని ఆ గ్రామంలో నివసిస్తున్న 30 కుటుంబాల ఆదివాసి గిరిజనులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.