Tuesday, 3 November 2026

అభివృద్ధిని చూసి.. 

కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారు
– టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదు
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
హైదరాబాద్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారని, తమ అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతుందోననే భయంతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ నేతల తీరుపై ఫైరయ్యారు. బుధవారం తెరాస భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  అన్ని వర్గాల నుంచి టీఆర్‌ఎస్‌కు వస్తున్నఆదరణను చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయలు దండుకున్న కాంగ్రెస్‌ నేతలకు టీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్‌ నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు చెప్పారు. ప్రభుత్వ శాఖలకు డబ్బులు చెల్లించి పార్టీ సభకు ఏర్పాటు చేస్తున్నామని పల్లా స్పష్టం చేశారు. 25 లక్షల మందికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం వాలంటీర్లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ట్రాక్టర్లలో సభకు లక్షలాది రైతులు స్వచ్చందంగా తరలివస్తారని, పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. మరో ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు మాట్లాడుతూ.. సభకు వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇందుకోసం వాలంటీర్లను నియమించామని, వివిధ జిల్లాల నుంచి రింగ్‌ రోడ్డు విూదుగా వచ్చే వారికి పార్కింగ్‌ గైడెన్స్‌ను వాలంటీర్లు అందిస్తారని రాజు తెలిపారు.