అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సిద్ధమేనా కాంగ్రెస్
మిర్యాలగూడ. జనం సాక్షి.ఎమ్మెల్యే రాజీనామా చేస్తే జిల్లాను సాధించుకోవచ్చు అదేవిధంగా అభివృద్ధి చేసుకోవచ్చని పట్టణ పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి జిల్లా కిసాన్ శాల అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు శుక్రవారం స్థానిక రాజీవ్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అభివృద్ధి చేశామని చెబుతున్న ఎమ్మెల్యే ఏ వార్డులో కూడా అభివృద్ధి జరగలేదని వారు విమర్శించారు ఒక్కొక్క వార్డుకు 50 లక్షల సిసి రోడ్లు 30 లక్షల ట్రైన్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పటం అంతా అబద్ధమని వారు విమర్శించారు అభివృద్ధిపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీరు చెబితే విలేకరుల సమక్షంలో బహిరంగ చర్చ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు మొహ్మద్ జాని. గంధం రామకృష్ణ.అనిత.నాగమణి రవికుమార్.మండల పార్టీ మాజీ అధ్యక్షులు బసవయ్య. నాగు నాయక్. తదితరులున్నారు