ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా కొమరారం,బోడు లను మండల కేంద్రాలుగా ప్రకటించాలి
– న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు
టేకులపల్లి, ఆగస్టు 26( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రెవెన్యూ డివిజన్ లోని కొమరారం బోడు లను మండల కేంద్రాలుగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఇల్లెందు ప్రాంతం ఆర్థికంగా,రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడినటువంటి ప్రాంతం. బొగ్గుకుపుట్టినిల్లు, బొగ్గు ద్వారా వచ్చిన ఆదాయం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడలేదని అన్నారు. శుక్రవారం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి పొడుగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి పరిపాలన దగ్గరగా ఉండటానికి ఉమ్మడిగా ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా ప్రకటించిందని ,15 రోజుల క్రితం రాష్ట్రంలో నూతనంగా 13 మండలాలను ప్రకటించిందని అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో కొమరారం మండలాన్ని ప్రకటిస్తామని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే గ్రామపంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ప్రకటించారని అన్నారు. ఇల్లందు మండల కేంద్రానికి ప్రభుత్వ ఆఫీసులలో పనులు చేయించుకోవడానికి కూడా వారాల తరబడి తిరగాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బోడు ప్రాంతానికి వస్తే టేకులపల్లి మండల కేంద్రానికి అనేక కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉన్నాయని,కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యంకూడ లేదన్నారు. రాష్ట్రంలో నూతన మండలాలు ప్రకటించాల్సి వస్తే మొదట కొమరారం, బోడు మండలాల తర్వాతనే ఇప్పుడు ప్రకటించిన 13 మండలాలు ప్రకటించాల్సి ఉండే, కానీ కొమరారం బోడు లను మండలాలుగా గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖర�