అభివృద్ధిలో ముందుంటే ఇంతమంది ఎందుకు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాంఛ
బచ్చన్నపేట అక్టోబర్ 13 (జనం సాక్షి) దేశంలో . రాష్ట్రంలో అంత అభివృద్ధి చేసినాము అంటే మునుగోడు ఎన్నికలలో ఇంత మంది ఎందుకని. బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచ వెంక రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు ఎన్నికల గురించి మాట్లాడుతూ. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అభ్యర్థిని గెలిపిస్తాయి అనుకుంటే 88 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు ప్రచారము అవసరం ఏముందని అన్నారు. అదేవిధంగా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా పలుమార్లు గెలిచి ప్రజలు ముఖ్యం కాదు నాకు డబ్బు ముఖ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.మునుగోడు ప్రజలను నిండా ముంచి వేరే పార్టీతో లోపాయ కారి ఒప్పందంతో ఇతర రాష్ట్రాల్లోని కాంట్రాక్టర్ల గురించి ఆయన సొంత లాభం గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అనుకుంటున్నాడు కానీ వారు ఎన్ని కుట్రలు పన్నిన మునుగోడు జనం కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.