కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజేే జిల్లా నూతన కమిటీ
హన్మకొండ బ్యూరో చీఫ్ 13 అక్టోబర్ జనంసాక్షి
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు) హనుమకొండ జిల్లా నూతన కమిటీ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ను కలిసారు.ఇటీవల నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కలెక్టర్ ను హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు.అనంతరం హనుమకొండ డిపిఆర్ ఓ లక్ష్మణ్ కుమార్ ను టీయూడబ్ల్యూజేే జిల్లా కమిటీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ ఓ లక్ష్మణ్ కుమార్, ఏపిఆర్ ఓ రాజేంద్ర ప్రసాద్, భూపాల్ రెడ్డి, టీయూడబ్ల్యూజేే రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మదు,జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్,జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం,సీనియర్ నాయకులు కంకణాల సంతోష్,సిరిపురం తిరుపతి రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. నయీం, డాక్టర్ పొడిశెట్టి విష్ణు వర్దన్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎ. రంజిత్ కుమార్,గన్ను సంతోష్,కార్యవర్గ సభ్యులు దండు మోహన్, ఎ. విష్ణు వర్దన్ రాజు, కొట్టె సుధాకర్, ముదిగిరి ఓదెలు, టి. రవి తదితరులు పాల్గొన్నారు.