మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టి ఆర్ ఎస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు,యువత.
ఎల్బీనగర్ (జనం సాక్షి ) తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టి ఆర్ ఎస్ మాత్రమే అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్ వరం మండలం ఫోరండ్ల గ్రామ బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువత,నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టి ఆర్ ఎస్ లో చేరారు.వారికి పార్టీ కండువా కప్పి మంత్రి టి ఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టి ఆర్ ఎస్ మాత్రమే అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలు దేశంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదని అన్నారు.ప్రజల అవసరాలు,ఆశయాలకనుగుణంగా తెలంగాణ లో పాలన కొనసాగుతుందని అన్నారు.టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన వారికి సముచిత గౌరవం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ ,ఎంపీటీసీ చంద్రయ్య ,మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు థామస్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు యాదయ్య గారు,యూత్ ప్రెసిడెంట్ శంకర్ గారు,ఉప సర్పంచ్ మల్లేష్ ,కో ఆప్షన్ సభ్యులు నర్సింహా ,కృష్ణయ్య , నిఖిల్ రెడ్డి పాల్గొన్నారు.మంత్రి సబితమ్మ నియోజకవర్గములో ప్రతి రోజు పర్యటిస్తూ చెపుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులు అయి టి ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరినవారిలో బీజేపీ కి చెందినవారు దన్నే శ్రీనివాస్ , సంగెం శివకుమార్ , పూసల వెంకటేష్ , వడ్ల చింటు గారు, ఎర్ర నిఖిల్ , సంగెం రాఘవేందర్ , సంగెం మహేష్ , మదిలాపుర్ రాఘవేందర్ గారు, గుండు బాయి సురేష్ , తవిట్ చిరంజీవి , దయ్యాల దేవేందర్ గారు,మదిలాపుర్ నరేష్ , మహమ్మద్ హైమత్ , చందా శ్రావణ్ గారు,తవిటీ శ్రీకాంత్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మోడీ రవి , మోడీ మహిపాల్ ,మోడీ చందు ,మోడీ సురేందర్ , కే ప్రవీణ్ ,మోడీ సురేష్ ,మోడీ సుధాకర్ ,మోడీ రాము ,మోడీ శివకుమార్ ,మోడీ అశోక్ , నందిగామ ఆనంద్ నందిగామ శివ గారు, మోడీ నరేష్ గారు, పెంజర్ల శ్రీకాంత్ ఉన్నారు.




