అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొన్న ఆకుల లలిత
నిజామాబాద్,మే3(జనం సాక్షి): గురువారం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 46వ డివిజన్ గౌతమ్ నగర్ లో అరుంధతి సేవాదళ్ సంఘం నిర్మాణ కొరకు 5లక్షల రూపాయలను కేటాయించి భూమి పూజ చేసారు. అనంతరం 42 వ డివిజన్ లోని భవన నిర్మాణ కార్మికుల సంఘంలో కల్యాణ మండప నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయల నిధులను కేటాయించి భూమి పూజను చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజల కొరకు అనేక అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. ఇకపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ల వేళలా ప్రజల పక్షానే ఉంటుందన్నారు. కార్యక్రమంలో గడుగు గంగాధర్, పంచారెడ్డి చరణ్, చంద్రకళ, కాలనీ వాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు పాల్గొన్నారు.