అభివృద్ధి చేస్తున్న పాలకవర్గాన్ని విమర్శించడం తగదు.
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి.
కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను ఖండించిన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు.
సిరిసిల్ల బ్యూరో. జులై 31. (జనంసాక్షి). రోజుకోసారి ప్రెస్ మీట్ పెడుతూ సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి కేటీఆర్ ను మున్సిపల్ పాలకవర్గాన్ని విమర్శించడం తగదని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, బిఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాముని వనిత చేసిన విమర్శలను తప్పు పట్టారు. మంత్రి కేటీఆర్ సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. అనవసరమైన విమర్శలు మానుకోవాలని కోరారు. సమావేశంలో పలువురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.