Tuesday, 3 November 2026

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  ఎల్బీనగర్ (జననం సాక్షి )  చంపాపేట డివిజన్ పరిధిలో దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన  పలు అభివృద్ధి పనులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య ఆథిదిగా హాజరై   శంకుస్థాపన చేశారు.  దానిలో భాగంగా గురువారం నాడు  రాజిరెడ్డి కాలనీ నందు సీ.సీ.రోడ్డు,రెడ్డి బస్తీ నందు సీ.సీ.రోడ్డు,కఠికొనికుంట నందు సీ.సీ.రోడ్డు శంకుస్థాపనతో పాటు దుర్గ భవాని నగర్,సాయి రామ్ నగర్,కుమ్మరి బస్తి,ఎస్.జీ.ఆర్.కాలనీ,సుల్తాన్ వాల్వ బస్తి దావఖాన దగ్గర సీ.సీ.రోడ్డు ఫ్యాచ్ వర్క్స్ పనులు ప్రారంభించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు ,నల్ల.రఘుమరెడ్డి,  గడ్డి అన్నారం  మార్కెట్ మాజీ డైరక్టర్      సుంకోజు.కృష్ణమాచారి,  మాజీ అధ్యక్షులు చీర శ్రీనివాస్    నాయకులు రాజిరెడ్డి  ,  ఉమా మహేశ్వర్ ,  కట్టా వెంకటేష్  , బొంబాయి  ‘రవిముదిరాజ్ ,  గూడురు  గౌతమ్ రెడ్డి , భాను ప్రకాశ్‌  రెడ్డి   రామ్,లక్ష్మణ్ , రోజారెడ్డి డివిజన్ పరిధిలోని సీనియర్నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ఉద్యమకారులు,మహిళలు పాల్గొన్నారు.