అమరవాయిలో “ఆరోగ్య పోషణ విద్య
మల్దకల్ అక్టోబర్ 1 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి అంగన్వాడి కేంద్రం2 లో ఎన్ హెచ్ డి1 లో తక్కువ బరువు పిల్లలను బరువులు,ఎత్తులు కొలిచి సిడిపిఓ కమలాదేవి పరిశీలించారు.శనివారం ఆర్ బి ఎస్ కే డాక్టర్ నిఖిలతో కలిసి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రుల కు వివరించి పిల్లల పరిశుభ్రత, పోషక ఆహారం చేతుల పరిశుభ్రత ల పై కౌన్సిలింగ్ ఇచ్చారు. సిడిపిఓ కమలాదేవి, అంగన్వాడి సూపర్ వైజర్ నాగరాణి,డాక్టర్ నిఖిల, సందర్శించడం జరిగింది. అంగన్వాడి టీచర్ తిమ్మమ్మ ,పిల్లలతల్లిదండ్రులు పాల్గొన్నారు.