అమరవాయి లో ఇంటింటికి జెండాలు పంపిణీ

మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) మండల పరిధిలోని అమరవాయి గ్రామంలోని75వ స్వతంత్ర దినోత్సవం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రతి ఇంటికి జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ పద్మమ్మ ,ఎంపిటిసి గోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం 75వ స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు తూమ్ కృష్ణారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మహేష్ , గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి ,నాయకులు ఊర బాయి నరసన్న ,కృష్ణయ్య గౌడ్, జాన్, కిష్టన్న,డబ్బా పళ్లెం తిమ్మప్ప,వెంకట్ రాములు, వినోదాచారి, వెంకటన్న ,వార్డ్ మెంబర్స్ ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.