Wednesday, 4 November 2026

కేశవపట్నం కార్యదర్శిపై కలెక్టర్కు ఫిర్యాదు

జనం సాక్షి,శంకరపట్నం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ పంచాయతీ కీ 2019 మార్చి నుండి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే ఇప్పటివరకు వివరాలు అందించలేదని సామాజిక ఉద్యమకారుడు సయ్యద్ అరిఫ్ గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. కేశవపట్నం గ్రామ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించారో వాటి వివరాలను అందజేయాలని 2019 మార్చిలో దరఖాస్తు చేశాను అన్నారు సమాచారం కొరకు గ్రామ పంచాయతీకి వివరాలు ఇచ్చేందుకు 408 రూపాయలు బ్యాంకు చాలా నా ద్వారా చెల్లించమని కార్యదర్శి సూచించడంతో 2021 అక్టోబర్ అక్టోబర్ 28న బ్యాంకులో చాలానా తీసినట్లు కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో అరిఫ్ పేర్కొన్నాడు తనతో డబ్బులు కట్టించుకొని సమాచార వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై చర్యలు తీసుకొని ఆ సమాచారాన్ని తగిన సమాచారాన్ని ఇప్పించగలరని కోరారు