Tuesday, 3 November 2026

అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌

చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ పాలన
ఐదేళ్ల పాటు రాష్టాన్న్రి భ్రష్టు పట్టించారు
ఇప్పటికీ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అన్న బొత్స్‌
విజయవాడ,మార్చి8(జనం సాక్షి): అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌ జరిగిందని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ సీఆర్డీఏ చట్టం ప్రకారం ముందుకు వెళతామని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హావిూలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నామని, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్‌లేని సీఎంగా చంద్రబాబు అయిదేళ్ల పనిచేయడం దురదృష్టమన్నారు. చంద్రబాబు కుటుంబంతో సహా ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటున్నారనే విషయం గుర్తుచేశారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలని విభజన చట్టం చెప్పిందని, అంతేగానీ తాము హైదరాబాద్‌ వెళ్తామని చెప్పలేదని బొత్స పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా వ్యంగ్యంగా మాట్లాడుతుం డటం బాధాకరమన్నారు. అమరావతి రాజధాని అని కేంద్రానికి పంపి అప్పుడే ఆమోదింప చేసుకుని ఉండాల్సిందని, చంద్రబాబు అలా చేయలేదన్నారు. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌ హావిూలను నెరవేర్చుతామని, దీనికి కట్టుబడి ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. మనిషి పొడుగు కావడం కాదు.. కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బొత్స ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు అండ్‌ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండి ఎంజాయ్‌ చేస్తారు కానీ తాము హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టీడీపీ నేతలకు ఎందుకు అభ్యంతరం వస్తుందని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ అడ్రస్‌ లేని ఓ వ్యక్తి పరిపాలన చేయడం మన దౌర్భాగ్యమన్నారు. విభజన సమయంలో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని.. ఈలోగా రాజధాని ఏర్పరచుకోవాలని శివరామకృష్ణ కమిటీని వేసి కొన్ని సూచనలు చేసిందని మంత్రి బొత్స గుర్తుచేశారు. కానీ చంద్రబాబు వీటిని పట్టించుకోకుండా స్వార్ధం కోసం అమరావతిని రాజధాని అని ప్రకటించారన్నారు. స్వలాభం కోసమో, దోపిడీ కోసమో రాజధాని అమరావతి అని చట్టం కూడా చేశారని ఆరోపించారు. ఆ చట్టాన్ని పార్లమెంట్‌కు పంపాలి కానీ ఆ పని చేయలేదన్నారు. దీనిని చెబితే అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా స్పందిస్తారా అంటూ బొత్స మండిపడ్డారు. ఈ వ్యంగ్య భాషల వళ్లే రాష్టాన్న్రి పదేళ్ల వెనక్కి నెట్టేశారని తెలిపారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని బొత్స పేర్కొన్నారు. పార్టీ ఆలోచన ప్రకారం శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో చంద్రబాబు ఎందుకు రాష్టాన్రికి రాలేదని.. హైదరాబాద్‌లో ఉండి పాలన చేశారని.. ఇదేనా వాళ్ల విధానం అంటూ నిలదీశారు.