అమెరికాలో మిన్నంటిన సంబరాలు

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో బరాక్‌ ఒబామా జయకేతనం ఎగరవేశారు. దీంతో అమెరికాలో డెమొక్రాట్ల సంబరాలు మిన్నంటాయి. డెమొక్రాట్‌ పార్టీ తరపున రెండోసారి ఒబామా గెలుపొందడంతో షికాగోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు విజయోత్సవరంలో మునిగితేలారు.