Thursday, 5 November 2026

అమెరికా ఎన్నికల్లో ఒబామా ఘనవిజయం

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడుగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బరాక్‌ ఒబామా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన మరో నాలుగేళ్లు శ్వేతసౌధంలో అధికారపీఠంపై కొనసాగుతారు. ఓట్ల లెక్కింపులో మొదట ప్రత్యర్థి మిట్‌ రోమ్నికంటే కొద్దిగా వెనుకబడినప్పటికీ, చివరలో పుంజుకొని ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లిపోయారు. విజయానికి కావలసిన మ్యాజిక్‌ సంఖ్య 270ను దాటిపోయారు. అమెరికా అధ్యక్ష పీఠంకోసం అత్యంత హోరాహోరీగా సాగిన పోటీలలో ఒకటయిన ఈ ఎన్నికల్లో ఒబామా విజయం సాధించడం వెనుక ఒహాయో రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. ఆర్థిక వ్యవస్థ సంతృప్తికరంగా లేకపోవడం, ప్రచారంలో రోమ్ని భారీగా నిధులు కుమ్మరించడం వంటి ప్రతికూలాంశాలు ఉన్నప్పటికీ ఒబామా విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా డెమోక్రటిక్‌ మద్దతుదారుల సంబరాలు అంబరాన్నంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *