Thursday, 5 November 2026

అమెరికా పర్యటనకు మేనేజ్‌మెంట్‌ డీన్‌

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. నాగేశ్వర్‌రావును విద్యార్థులు తోటి అధ్యాపకులు అభినందించారు. ఈ నెల 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. నాగేశ్వర్‌రావు కీలకోపన్యాసం చేయనున్నారు. కాలిఫోర్నియా, సానిడిగోలోని ఏలియెంట్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీకి సంబంధించిన కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లీడర్‌షిప్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. బిజినెస్‌ రీసర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్‌ ద గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌పై నిర్వహించనున్న నాలుగవ వార్షిక అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో గ్లోబలైజేషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. మేనేజ్‌మెంట్‌ విభాగానికి చెందిన నాగేశ్వర్‌రావు ప్రస్తుతం డీన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, విద్యార్థులు అభినందించారు.