Monday, 2 November 2026

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం

బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద బుధవారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. పేరు చెప్పుకోవడడానికి ఇష్ట పడని, గుప్త దాత సహకారంతో 172వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, లెంకల శ్రావణ్ కుమార్, ఎండి యూసుఫ్, చందుపట్ల లింగన్న పాల్గొన్నారు.