Wednesday, 4 November 2026

అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి:సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు

అనంతగిరి జనంసాక్షి: కనకదుర్గమ్మ అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు అన్నారు.మండల పరిధిలోని అమ్మినాబాద్ గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. మహోత్తరమైన అన్నదాన కార్యక్రమానికి దాతలుగా 20మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఉండడం హర్షించదగ్గ విషయమని వారికి కృతజ్ఞతలని వారు తెలిపారు.అంతేకాకుండా గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు కలగాలని,రైతులందరూ సుభిక్షంగా ఉండాలని,యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపరచాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరినట్టు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సిహెచ్ వెంకటేశ్వరరావు,సాదె కోటేశ్వరరావు,సత్యనారాయణ,శ్రీను,గురవయ,కృష్ణ,రాకేష్,సాయి,మధుబాబు,లింగారావు ,దీక్ష స్వాములు,యువకులు ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.