ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం కార్యవర్గం సభ్యుల ను సన్మానించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్ లు ఇటీవల నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. శనివారం జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ ని సన్మానించారు.అనంతరం సభ్యులు ఆఫీసు కొరకు స్థలం మరియు నిర్మాణము కొరకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కు మెమొరండం ఇవ్వడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దశరథ్ రెడ్డీ, టి కృష్ణ రెడ్డీ, మొహమ్మద్ ముజహీద్, సునీల్ కుమార్, అయ్యప్ప రెడ్డీ, క్రిస్టోఫర్, శ్రీశైలం, గౌతం, శ్రీనివాస్ రెడ్డి, యేసురత్నం, విఠల్, బి నాగన్న, మోహన్ రెడ్డి మరియు మధు తదితరులు ఉన్నారు.