హైదరాబాద్,జూలై4(జనం సాక్షి ): సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన మాడల్ కిచన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ప్రారంభించారు. కార్పోరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఈఓ అన్నపూర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. అమ్మవారికి సొంత నిధులతో డైమండ్‌తో కూడిన ఖడ్గం, ముక్కుపుడక, బొట్టు సమర్పిస్తామని తెలిపారు. అదేవిధంగా 250 కిలోల వెండితో గర్భగుడికి వెండి తాపడం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సారి జాతరను ఘనంగా నిర్వహించనునున్నట్లు.. అమ్మవారికి బంగారం బోనం సమర్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.




