” అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి – బిజెపి నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, అక్టోబర్ 01( జనంసాక్షి): దేవి శరన్నవరాత్రులు పురాణాలనుండి ఎంతో వైశిష్టతను కలిగిన ప్రత్యేక పండుగగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో నెలవై ఉన్నాయని, అలాంటి ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి ఆశీస్సులు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు లభించి అందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరి సంపదలతో విలసిల్లాలని భాజపా సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈమేరకు శేరిలింగంపల్లి డివిజన్ పరిధి తారానగర్ లో ఏర్పాటుచేసిన అమ్మవారి మండపంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి తోకలిసి శుక్రవారంరాత్రి ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిపరాశక్తి, ఓంకార శక్తిస్వరూపిణీ అయిన అమ్మవారికి సంబంధించి పురాణాలు, ఇతిహాసాల నుండి దుర్గామాత అమ్మవారికి ఎంతో ప్రత్యేకత ఉందని, అందుకే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో దేవి శరన్నవరాత్రులకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి రుగ్మతలు, సమస్యలు లేకుండా ప్రజలత హాయిగా జీవించాలని గజ్జల, పోరెడ్డి ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో తారా నగర్ స్థానిక పరిసరాల భక్తులు, ప్రజలు, డివిజన్ బిజెపినాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.